కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 298కి చేరినట్టు

తాజాగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 298కి చేరినట్టుగా కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రకటించింది. ఈ మేరకు అధికారిక వెబ్‌సైట్‌లో నమోదు చేసింది. ఈ మహమ్మారి బారినపడి ఇప్పటివరకు నలుగురు ప్రాణాలు కోల్పోయారని, 22 మంది కరోనా బారి నుంచి కోలుకొని డిశ్చార్జి అయినట్టు వివరించింది. కరోనా కేసులు శనివారం ఉదయం 258 నమోదు కాగా, వీరిలో 39 మంది విదేశీయులు ఉన్నట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశంలో శుక్రవారం ఒక్కరోజే 55 కరోనా కేసులు ఎక్కువగా నమోదు కావడం విస్మయం కలిగించింది.

Post a Comment

0 Comments